Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొప్పల పైనే దృష్టి : అమర్త్యసేన్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సంక్షోభానికి దారి తీయడానికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమన్నారు నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్. గందరగోళంలో ఉన్న కేంద్రం ప్రమాదకర కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి పని చేయడం కంటే తాను చేపట్టిన చర్యల విషయంలో క్రెడిట్‌పై దృష్టి సారించిందన్నారు. ఫలితంగా అది తీవ్ర ఇబ్బందులకు దారి తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సేవా దళ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరుపై పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఫార్మా ఉత్పత్తి, అధిక రోగనిరోధక స్థాయిలు వంటి కారణంగా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ చక్కటి స్థానం లభించిందన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4500 మరణాలు నమోదైన తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం గందరగోళంలో ఉండటంతో తగిన స్పందన లేనందున భారత్ తన శక్తులను ఉపయోగించుకోలేకపోయిందని అమర్త్యసేన్ అన్నారు. బహుశా, భారత్.. ప్రపంచాన్ని కాపాడుతుందన్నంతగా వారు (ప్రభుత్వం) ప్రగల్భాలు పలికారని చెప్పారు. ఆర్థిక, సామాజిక విధానాలతో పాటు అన్నింటికంటే ఆరోగ్య సంరక్షణ, విద్యలో 'పెద్ద నిర్మాణాత్మక మార్పు'పై అమర్త్యసేన్ వాదించారు.