Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో తమిళనాడులో 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఒక ప్రకటన చేశారు. పరీక్షల అంశంపై విద్యాశాఖ మంత్రి మహేష్ పొయ్యమోజ్జి నివేదిక అనంతరం సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను నిర్వహించాలా లేదా రద్దు చేయాలా? అనే దానిపై ప్రభుత్వం గత మూడు రోజులుగా విద్యావేత్తలు, అధ్యాపకులు, వైద్య నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు చేసింది.