Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు పెట్రో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు 2025 నాటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను బ్లెండింగ్ (కలుపుతామని) చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇథనాల్ రోడ్ మ్యాప్‌ను శనివారం మోడీ విడుదల చేశారు. గతేడాది ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (90 శాతం డీజిల్‌లో 10 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేయడం) లక్ష్యం సాధించాలని, 2030 నాటికి 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని 2025 నాటికి సాధించాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. 2014లో 1 నుంచి 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్, ప్రస్తుతం 8.5 శాతానికి చేరుకుందని మోడీ తెలిపారు. 38 కోట్ల లీటర్లుగా ఉన్న ఇథనాల్ కొనుగోలు 320 కోట్ల లీటర్లకు చేరుకుందని పేర్కొన్నారు. గతేడాది ఆయిల్ కంపెనీలు ఇథనాల్ కొనుగోలుపై దాదాపు రూ.21 వేల కోట్ల మేర వెచ్చించాయని చెప్పారు. ఇథనాల్ పర్యావరణ పరిరక్షణకు దోహదంగా ఉండడమే కాకుండా రైతుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతోందని అన్నారు.