Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.20కోట్ల డోసుల్లో సగం బడా కార్పొరేట్ హాస్పిటల్స్ కొనుగోలు
- 10 ప్రయివేటు ఆస్పత్రులకు 60.57లక్షల డోసులు కేటాయింపు
- కేంద్రం కొత్త వ్యాక్సిన్ విధాన ఫలితమిది : వైద్య నిపుణులు
- వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలకు దారితీస్తుందని హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న జనానికి కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం 'వ్యాక్సిన్'. కరోనా వైరస్ నుంచి కాపాడే వ్యాక్సిన్ వచ్చింది..హమ్మయ్య! రేపో..మాపో..వ్యాక్సిన్ పొందుతామని ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కేంద్రం సేకరిస్తున్న డోసులు ఏమాత్రమూ సరిపోవటం లేదు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేసి..వ్యాక్సిన్ కొనుగోలు చేయకుండా..ఆ బాధ్యత నుంచి మోడీ సర్కార్ క్రమంగా తప్పుకుంటోంది. వ్యాక్సిన్ పంపిణీలో కొత్త విధానం మే 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బడా కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేశాయని జాతీయ ఆంగ్ల దినపత్రిక ఒక టి వార్తా కథనం వెలువరించింది. వ్యాక్సిన్ సేకరణలో కొత్త విధానం వల్ల అస మానతలు తలెత్తుతాయని, ఇది కరోనా సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆ వార్తా కథనం విశ్లేషించింది. వ్యాక్సిన్లను ప్రయివేటు హాస్పిటల్స్ కొనుగోలు చేసుకు నేందుకు మార్గం సుగమం చేశారని విమర్శించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేనెల వ్యాక్సిన్ స్టాక్‌లో 50శాతం బడా కార్పొరే ట్ హాస్పిటల్సే కొనుగోలు చేశాయి. ఇలాంటి విధానం కరోనా వైరస్‌పై జరిగే పోరా టాన్ని మరింత సంక్లిష్టంగా మార్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
10 సంస్థలకు 60.57లక్షల డోసులు
అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, హెచ్ఎన్ హాస్పిటల్ ట్రస్ట్ (రిలయన్స్ ఫౌండేషన్ వారిది), మెడికా హాస్పిటల్స్, ఫోర్టీస్ హెల్త్‌కేర్, గోద్రెజ్, మనిపాల్ హెల్త్, నారాయణ హృదయాలయ, టెక్నో ఇండియా దామా...ఈ పది కార్పొరేట్ హాస్పిటల్స్ మే నెలలో 60.57లక్షల వ్యాక్సిన్ డోసుల్ని కొనుగోలు చేశాయని సమాచారం. మేలో కేంద్రం మొత్తం 1.20కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేయగా, అందులో 50శాతం బడా కార్పొరేట్ హాస్పిటల్స్ దక్కించుకోవటం గమనార్హం. బడా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వస్తున్న వ్యాక్సిన్ కొనుగోలు ఆర్డర్లను మాత్రమే తయారీ సంస్థలు స్వీకరిస్తున్నాయి. ఇలా సేకరించిన టీకాలన్నీ మెట్రో నగరాల్లో మాత్రమే ఇస్తున్నారని, చిన్న పట్టణాలకు సరఫరా కావటం లేదని తేలింది. గ్రామాల్లో టీకాల పంపిణీ పూర్తిగా పక్కకు పోయే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, కర్నాటకలోని చిన్న పట్టణమైన షిమోగాలో 'సర్జీ' అనే ప్రయివేటు హాస్పిటల్‌కు కేవలం 6వేల డోసులు వ్యాక్సిన్ మంజూరైంది.