Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మొదట్లో పట్టణ ప్రాంతాల్లో పంజా విసిరిన కరోనా మహమ్మారి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కోవిడ్-19 సెకండ్‌వేవ్ గ్రామీణ భారతంపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇదే సమయంలో ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ కొరత, మందులు, పడకల కొరత క్రమంలోనే దేశంలోని 3.8 మిలియన్ ఆరోగ్య సంరక్షణ శ్రామిక శక్తి రోగులకు చికిత్స చేయడానికి తీవ్రంగా పోరాడుతోంది. దాదాపు అన్ని విషయాల్లో అధ్వాన్న పరిస్థితుల్లో గత నెలలో సంభవించిన వినాశనం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పాటు థర్డ్‌వేవ్ భయాన్ని చుట్టుముట్టేలా చేసింది. గతేడాది కరోనా వెలుగు చూసినప్పటి నుంచి మహారాష్ట్రలో అత్యధికంగా 99 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో 20 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. కర్నాటకలో 29,500, బెంగాల్లో 15,800, బీహార్‌లో 5200లకు పైగా మరణాలు నివేదించబడ్డాయి. కోవిడ్ మరణాలతో పాటు ఇతర కారకాలు, తప్పుడు సమాచారం సైతం అధికంగానే వ్యాప్తి చెందింది.
''మార్చి-ఎప్రిల్ వరకు బెంగాల్లో ఎన్నికల ర్యాలీలలో మాస్కులు లేకుండా జనాలు ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా మే2 తర్వాత రోగులతో మా ఆస్పత్రి నిండిపోతుందని ముందే ఊహించాము. దానికి అనుగుణంగానే 250 పడకలతో ఉన్న మా ఆస్పత్రిలో రోగులతో నిండిపోయింది. వారందరూ కూడా అత్యంత పేదలు. వారు కండ్ల ముందే ప్రాణాలు కోల్పోతుంటే నిస్పహాయంగా అనిపించింది'' అని స్వాప్నిల్ అన్నారు. సిబ్బందితో సహా అన్నింటికీ కొరత ఏర్పడింది. తమ సిబ్బందిలో 50 శాతం మంది కరోనా బారినపడ్డారన్నారు. ఇదిలా ఉండగా కర్నాటకలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 23 మంది కరోనా రోగులు కన్నుముశారు. ఇలాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల లేమీ, ప్రజలకు అవగాహన లేకపోవడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది.