Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల్లో వారి సంఖ్య తక్కువగానే : యునెస్కో నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల్లో మహిళల ప్రాతనిధ్యంపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆందోళన వ్యక్తం చేసింది. వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నదని తాజా నివేదికలో నొక్కి చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి వ్యవహారాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చిందని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ సృజనాత్మక ఆర్థిఖ సంవత్సరంగా జరుపుకుంటున్నందున ఈ నివేదికను విడుదల చేశారు. 'జెండర్ అండ్ క్రియేటివిటీ : ప్రోగ్రెసివ్ ఆన్ ది ప్రెసిపీస్' అనే పేరుతో నివేదికను విడుదల చేశారు. స్వీడన్ ప్రభుత్వ సహకారంతో ఈ నివేదికను యునెస్కో తయారు చేసింది.
ఈ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. సృజనాత్మక, సాంస్కృతిక పరిశ్రమల విషయంలో మహిళలు ఇప్పటికీ అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ పెరుగుదల సృజనాత్మక, సాంస్కృతిక పరిశ్రమలలో ప్రస్తుతం ఉన్న లింగ అసమానతలకు కొత్త కోణాన్ని జోడించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తప్పనిసరైన ఆన్లైన్ పనుల కారణంగా సామాజిక, ఆర్థిక సహాయం కోసం మహిళలు సేవలు పరిమితంగా మారాయి. ఆన్లైన్ క్లాసులలో బాలికల సంఖ్య అసమానంగా ఉన్నది. మహిళలు, లింగ-విభిన్న కళాకారులు, సృజనాత్మక నిపుణులు వేధింపులు, బెదిరింపులకు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. కోవిడ్-19కి సంబంధించి ప్రతిస్పందించడంతో మహిళలు కీలక పాత్ర పోషించినప్పటికీ లింగ అసమానతలు విస్తరించాయని పేర్కొన్నది.