Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితంగా భారత్ దాని ప్రభావాన్ని అనుభవిస్తోంది ఇలా..!
- అయితే, ప్రజలకు నేర్పుతున్న పాఠాలేంటి?
న్యూఢిల్లీ: ''విశ్వగురు'' వావాలనే ప్రధాని మోడీ కల నెరవేరింది కానీ ఆయన కోరుకున్న మార్గాల్లో కాదు ! ప్రపంచంలో దార్శనిక నాయ కత్వానికి ఆదర్శప్రాయంగా మార డానికి బదులు.. భారత ప్రధాన మంత్రి ఒక మహమ్మారి ఎలా నిర్వహించకూడదో (ఆర్థిక వ్యవ స్థను ఎలా నిర్వహించకూడదు, దేశాన్ని ఎలా నడపకూడదు) అనే దానికి ఒక కేసు స్టడీగా మారారు. అవును నిజమే.. భారత కోవిడ్ విపత్తు నింద ప్రధానంగా ప్రధానిపై ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదివరకు రాయిటర్స్ నివేదించినట్టుగా ''భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ నిపుణుల కమిటీ మార్చి ప్రారంభం ముందే దేశంలో కరోనా ఉధృతి రాబోతుందనీ, కొత్త వేరియంట్లు విరుచుకుపడ బోతున్నాయని హెచ్చరించింది. అయితే, కరోనా ప్రభావం.. కొత్త వేరియంట్ల వ్యాప్తిని అడ్డుకోవటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీని కారణంగానే ఏప్రిల్ 1 నాటికి కొత్త కేసులు నాలుగు రెట్లు పెరిగాయి.'' ముందస్తు హెచ్చరికలు ఉన్నా పెద్ద సమావేశాలు నిరోధించక పోగా.. ఎన్నికల ర్యాలీలు, లక్షలాది మంది గుమిగూడే కుంభమేళా సహా పలు కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే ఉప్పెనను ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటుంటే... భారత ప్రధాని మోడీ మాత్రం వైరస్‌పై విజయం సాధించామంటూ ప్రకటించారు. కానీ రాబోయే కరోనా సునామీని ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు, వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యలు మాత్రం తీసుకోలేదు.
అయితే, రెండో సారి భారీ మెజారిటీని కట్టబెట్టి అధికార కుర్చీలో కూర్చొబెట్టిన ప్రజలు చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. వాటిలో మొదటిది ఎన్నికల ఎంపికలు శాశ్వాత పరిణామాలను కలిగి ఉంటాయి. అదే అద్భుతంగా విఫలమైన ప్రభుత్వాన్ని భారత ప్రజలు (భారత ప్రజలందరూ కాదు) ఎన్నుకున్నారు. ఒక్కసారి కాదు రెండు సార్లు భారీ మెజారిటీ ఇచ్చారు. ఆ నిర్ణయానికి ఓటర్లు ఇప్పుడు చింతిస్తున్నారు. ఇక రెండోది చరిత్రను విస్మరించడం. దేశంలో చాలా మంది ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పాత్రికేయులు మోడీ వివాదాస్పద గతాన్ని విస్మరించడానికి సిద్ధంగా ఉండటం గమనార్హం.
ఇక మూడోది శాస్త్రీ అంశాలను విస్మరించడం (తొలగించడం). రాబోయే పెను ఉప్పెనలకు సంబంధి శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరికలను పట్టించు కోకపోగా.. అధికార నేతలు, మంత్రులు అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేస్తుంటే.. ప్రధాని హెచ్చరించాల్సింది కానీ అలా చేయలేదు. అంటే దేశాన్ని నడిపే వ్యక్తి సైన్స్పట్ల, శాస్త్రవేత్తల పట్ల, నిపుణులు అభిప్రాయాలను సైన్స్ కఠిన మైన వాస్తవాలను గౌరవించే వాడై ఉండాలనే విషయాన్ని గుర్తెరగాలి.
నాల్గోది ద్వేషం అందిరినీ బాధపెడుతోంది. ఎందుకంటే దేశంలో హిందూయేతరులకు ఒక పాఠం నేర్పడానికి ఒక ''హిందూ హృదరు సామ్రాట్'' కావాలని చాలా మంది మోడీకి ఓటు వేశారు. విభజన నాయకుడిని ఎన్నుకో వడంతో.. అతని విభజన చివరికి మనం ద్వేషించే వారిని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ బాధపెడుతోంది. ఇక ఐదో అంశం ప్రజాస్వామ్యంలో మౌనవ్రతం. దేశంలో చాలా మంది గత ఏడేండ్లుగా మౌనంగా ఉండటానికే పరిమిత మయ్యారు. ఎందుకంటే దానిని ఎదుర్కొందామంటే ఏమి ప్రశ్నించిన అది ఒక పెద్ద మతాన్ని ప్రశ్నించినట్టుగా మనోభా వాలను దెబ్బతీసినట్టుగా ప్రచారంతో దాడులకు గురవు తున్నారు. ఇప్పుడున్న ప్రధాని నుంచి మెరుగైన చర్యలు ఆశించడం శూన్యమే అయినా.. రాబోయే కాలంలో ఈ అంశాలు ప్రభావవంతంగా ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.