Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమిళనాడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఎఐఎడబ్ల్యుయు మాజీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు జి.మణి (72) ఇక లేరు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వారం ఆయనకు కరోనా సోకింది. ఆయన శనివారం రాత్రి చెన్నైలోని ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు భార్య గీతా, కుమార్తె చిత్ర, కుమారుడు దినేష్ ఉన్నారు. ప్రస్తుతం మణి ఎఐఎడబ్ల్యుయు జనరల్ కౌన్సిల్ సభ్యులుగా బాధ్యతల్లో ఉన్నారు. తమిళనాడు చెరుకు రైతు సంఘం కార్యదర్శిగానూ, రైతు సంఘం రాష్ట్ర క్యాదర్శివర్గ సభ్యులుగానూ మణి పనిచేశారు. గ్రామీణ కార్మికుల హక్కుల సాధన ఉద్యమాల్లో ముందుపీఠిన నిలిచి పోరాడారు.
మణి మరణం పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ మేరకు ఆదివారం ఎఐఎడబ్ల్యుయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయ రాఘవన్, బి.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు.