Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న 12వ తరగతి ఇంటర్నల్, ప్రాక్టికల్స్ అసెస్మెంట్ పరీక్షలను ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్వహించి, ఈ నెల 28లోగా మార్కులను కూడా పంపించాలని పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్దేశించింది. ఈ మేరకు సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కొన్ని పాఠశాలలు ఇంకా పలు సబ్జెక్టులకు ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్మెంట్లను నిర్వహించలేదని సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సాన్యం భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో పరీక్షలను నిర్వహించేందుకు అనుమతిస్తున్నామని, వెబ్సైట్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈనెల 28లోగా మార్కులను అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఫలితాలను ఏ విధంగా నిర్ణయించి, విడుదల చేయాలనే దానిపై సీబీఎస్ఈ ప్యానెల్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్టు మ్యూలాంకనానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం సీబీఎస్ఈ ఒక ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌ను నియమించింది. ఆయన పరీక్షల తేదీ, ఆన్లైన్ ద్వారా వైవా నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఒక ఇంట ర్నల్ అసెస్మెంట్ విషయానికి వస్తే.. సంబంధిత అధ్యాపకులు సీబీఎస్ఈ మార్గదర్శకాలను అనుగుణంగా విద్యార్థులకు పరీక్షలు పెడతారు.