Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలతో హోరెత్తుతున్న లక్షద్వీప్
తిరువనంతపురం : ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన నూతన నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో స్థానికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. 12 గంటల నిరాహారదీక్షలో భాగంగా తమ నివాసాల వెలుపల, బీచ్‌లలో ప్లకార్డులను ప్రదర్శించారు. మరికొందరు సముద్ర అంతర్భాగంలో కూడా ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల లక్షద్వీప్‌లో అధికారం చేపట్టిన ప్రఫుల్ ఖోడా పటేల్ అభివృద్ధి పేరుతో ప్రవేశపెట్టిన నూతన ఆంక్షలను పలువురు విభేదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రఫుల్‌ను వెంటనే తొలగించాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఈ ద్వీపాల సమూహంలో సుమారు 70వేల మంది నివాసముంటున్నారు. వీరంతా అడవులు, బీచ్‌లు, సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఆంక్షలతో తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల్లో ముఖ్యమైనది నిర్బంధ చట్టం (గూండాయాక్ట్). అసాంఘీక చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా ఎటువంటి విచారణ లేకుండా సంవత్సరం పాటు అదుపులోకి తీసుకో వచ్చన్నది ఈ చట్టం ఉద్దేశ్యం. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని ఈ చట్టం పేరుతో అదుపులోకి తీసుకుంటారని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ -2021 ప్రజల సంస్కృతినీ, సంప్రదాయాలను నాశనం చేయడంతో పాటు భూములను స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఏకపక్షంగా అధికా రులకు ఇస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షద్వీప్‌లో అధిక ంగా ముస్లిం జనాభా ఉంది. వీరంతా పశువుల పెంపకం, రవాణా, విక్ర యంపై ఆధారపడి జీవిస్తుంటారు. వీటిపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వారి జీవనోపాధి, ఆహారపు అలవాట్లను దెబ్బతీ స్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సంతానం ఉన్న వారు గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని మరో నిబంధనను ప్రవేశపెట్టింది. ఇటువంటి పలు నిబంధనలు నిరసనలకు దారితీశాయి. ప్రజల నిరసనలకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పలువురు ఎంపీలు, అధికారులు ప్రఫుల్‌ను తొలగించాలని, ఈ నిబంధనలు లక్ష ద్వీప్ అభివద్ధికి అవరోధంగా మారతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టం ముసాయిదాను కేంద్ర హౌం శాఖ ఆమోదించింది.