Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన ఖాతాదార్లకు రుణ పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్‌తో ప్రభావితమైన తమ ఖాతాదార్లకు యూకో బ్యాంక్ రుణ పునర్ వ్యవస్థీకరణ, ఇతర ఉపశమన ప్రణాళికను ప్రకటించింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం 'రిజాల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0'ను 2314 ఖాతాలకు వర్తింపజేసినట్టు యూకో బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ 'గ్యారెంటెడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్' పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు అధికారులు తెలిపారు. హెల్త్‌కేర్ రంగంలోని పరిశ్రమల అత్యవసర నిధుల సమస్యను పరిష్కరించడానికి యూకో-సంజీవని, ఆరోగ్యం, కవచ్ అనే మూడు రుణ పథకాల్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే వివిధ భాగస్వామ సంస్థలతో కలిసి వ్యక్తిగత, గ్రూప్ ఆరోగ్య, జీవిత బీమా పథకాల్ని అందజేస్తున్నామని బ్యాంకు వర్గాలు తెలిపాయి.