Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీలకు సంకెళ్లువేసి కోర్టులో హాజరుపరచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అలా చేయడానికి వారేమీ గ్యాంగ్స్టర్లు కారని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో గతేడాది చెలరేగిన మత అల్లర్లలో ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ''అతి ప్రమాదకర ఖైదీలు'' కనుక వారి చేతులకు వెనక నుంచి సంకెళ్లు వేసి కోర్టులో విచారణలకు తీసుకొచ్చేలా అనుమతించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు ఈ పిటిషన్ వేశారు. అదనపు సెషన్స్ జడ్జి వినోద్ యాదవ్ ఈ పిటిషన్ విచారణను చేపట్టారు. ఈ విధంగా చేయడానికి వారు గతంలో ఏదైనా కేసులో దోషులు కానీ, గ్యాంగ్స్టర్లు కారని న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారు కోర్టుకు వారు భౌతికంగా రాలేకపోతున్నందున ప్రస్తుత సమయంలో ఈ పిటిషన్ అవసరం లేదని న్యాయమూర్తి చెప్పారు.