Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ కొవాక్సిన్ ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. సోమవారం ఎయిమ్స్‌లో 2 నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలపై వీటిని ప్రారంభించారు. భారత్ బయోటెక్ టీకా పిల్లలకు అనుకూలంగా వుందా లేదా అనేది పరీక్షించేందుకు ఎయిమ్స్ పాట్నాలో ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. వారి స్క్రీనింగ్ నివేదికలు వచ్చిన తర్వాత టీకాలు ఇస్తారు. ఆరోగ్యవంతులైన 525 మంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్‌లో భాగంగా మొదటి రోజు , 28వ రోజు రెండు డోసుల్లో కండరానికి టీకా ఇస్తున్నట్లు ఎయిమ్స్‌లో సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజరు రారు తెలిపారు. పిల్లలకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు మే 12న భారత ఔషధ నియంత్రణా సంస్థ అనుమతినిచ్చింది. ఇప్పటివరకు పిల్లల్లో కోవిడ్ అంత తీవ్రంగా లేనప్పటికీ వైరస్ జన్యుపరివర్తన చెందితే పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చని భావిస్తున్నామని అందుకే ముందుగా పిల్లలకు కూడా ట్రయల్స్ నిర్వహించాలని భావించినట్టు ప్రభుత్వం గత వారం తెలిపింది. పిల్లల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లనున సమీక్షించేందుకు జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో వున్న డేటా, క్లినికల్ సమాచారం, అనుభవాలు, వ్యాధి గణాంకాలు, వైరస్ స్వభావం, మహమ్మారి తీవ్రత వంటి అంశాలన్నింటినీ సవివరంగా సమీక్షించిన అనంతరం కొన్ని మార్గదర్శకాలు రూపొందించిందని నిటి అయోగ్ సభ్యుడు (ఆరోగ్య) వికె పాల్ తెలిపారు.