Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళనలపై సీఎస్సీ డేటా
న్యూఢిల్లీ : దేశంలో 2017 నుంచి ఇప్పటి వరకూ రైతు నిరసనలు, ఆందోళనలు ఐదు రెట్లు పెరిగాయి. మూడు వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలతో పాటు సేకరణ, వ్యవసాయ మార్కెట్ సంబంధిత వైఫల్యాలు ఇవన్నీ కలిసి రైతుల ఆందోళనలను పెంచాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్సీ) సేకరించిన డేటా పేర్కొంది. 2017లో 15రాష్ట్రాల్లో 34 ప్రధాన ఆందోళనలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఖ్య ఈ ఏడాదికి 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 165కు పెరిగింది. వీటిల్లో 12 ఆందోళనలు భారతదేశమంతటా జరిగాయి. వీటిల్లో 11 కేంద్రం గతేడాది ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే. ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు జరపకపోవడంతో సహా పలు విధాన వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు దేశవ్యాప్తంగా 96 జరిగాయి. పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్ వైఫ ల్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రోత్సా హక ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నిరసనలు 38 జరిగాయి. హైవే, విమా నాశ్రయ నిర్మాణాలకు సహా అభివద్ది ప్రాజెక్టుల కోసం వ్యవసాయ భూములను తీసుకోవడానికి వ్యతిరేకంగా 17సార్లు ఆందోళనలు చేప ట్టారు.రుణాల మాఫీ చేయాలని, పంటల బీమా కవరేజి, నష్టపరిహారం చెల్లింపులో లొసుగులను సరిచేయాలని కోరుతూ రైతులు ఏడుసార్లు ఆందో ళనలు చేపట్టారు. వ్యవసాయ ఉపకరణాలు, ఎరువుల ధరల పెంపునకు నిరసనగా 2020-21లో నాలుగుసార్లు రైతులు ఆందోళనకు దిగారు. రైతు నేతల అరెస్టును నిరసిస్తూ కూడా ఆందోళనలు జరిగాయి.ఇటీవల ఢిల్లీ వెలుపల పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన నిరసనలు వీటన్నిటికీ హైలైట్. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగా ణాల్లో కూడా ఇటీవల పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపట్టినట్లు సిఎస్ఇ డేటా తెలియచేస్తోంది.దేశంలో ప్రస్తుతం భూ యజమానులు, సాగుదార్లు కన్నా వ్యవసాయ కూలీలు ఎక్కువగా వున్నారని సీఎస్ఈ నివేదిక పేర్కొంది. దేశంలోని 52శాతం జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనడం వాస్తవం. బీహార్, కేరళలోని అన్ని జిల్లాల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగానే వుంది. దాదాపు ప్రతి రోజూ 28మందికి పైగా వ్యవసాయ కూలీలు, రైతులు ఆత్మహత్యలు చేసుకు ంటున్నారు. 2019లో 5,957మంది రైతులు, అదనంగా 4,324మంది కూలీలు ఆత్మహత్యలు చేసుకుని మరణించారని తాజా డేటా తెలియ చేస్తో ంది.వ్యవసాయ రంగానికి సంబంధించిన డేటాను మరింత మెరుగ్గా నిర్వహించాలని సిఎస్ఇ కోరింది. వాస్తవానికి 14 రాష్ట్రాల్లో భూ రికార్డుల నాణ్యత క్షీణిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యవసాయ సంక్షోభం, అశాంతి అనే టైం బాంబ్ మీద భారత్ కూర్చుని వుందని, గడియారంలో ముల్లులు చాలా వేగంగా కదులుతున్నాయని సీఎస్ఈ తన నివేదికలో వ్యాఖ్యానించింది.