Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-18 మంది కార్మికులు మృతి, శానిటైజర్లు తయారీ కంపెనీలో విషాదం
పూణె: మహారాష్ట్రలోని పూణేలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ పరిశ్రమకు చెందిన శానిటైజర్ తయారీ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో 18 మంది కార్మికులు మరణించారు. మృతుల్లో 15 మంది మహిళలే కావడం గమనార్హం. పూణే శివార్లలోని పిరాన్గట్ ఎంఐడిసి ఏరియాలోని ఎస్విఎస్ అక్వా టెక్నాలజీస్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మరో 20 మందిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఒక యంత్రంలో పేలుడు కారణంగా మంటలు రేగాయని, దీంతో అక్కడ పనిచేస్తున కార్మికులు బయటకు రాలేకపోయారని స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక శకటాలతో గంటన్నరకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఇదే సమయంలో మంటల్లో చిక్కుకున్న వారిలో పలువురిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం సంభవించిన సమయంలో ప్లాంట్లో 37 మంది కార్మికులు పనిచేస్తున్నారని స్థానిక అగ్నిమాపక దశ విభాగం తెలిపింది.