Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా ఉద్యమంలో రైతులు విజయం
న్యూఢిల్లీ : రైతుల ఆందోళనకు హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం దిగొచ్చింది. తోహానా ఉద్యమంలో రైతులు విజయం సాధించారు. జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) చెందిన ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతులను ఇటీవల అరెస్టు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన అమాయక రైతులను విడుదల చేయాలనీ, వారిపై ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా రైతులు తమ ఆందోళన కొనసాగించారు. రైతులు చారిత్రాత్మకంగా ఆందోళన చేశారు. ఫతేహాబాద్‌లోని తోహానాలో పోలీస్ స్టేషన్‌ను దిగ్భందించారు.వేలాది మంది రైతుల నుంచి పెరుగుతున్న నిరంతరాయంగా ప్రతిఘటన తరువాత తోహానాలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల అన్ని డిమాండ్లకు హర్యానా ప్రభుత్వం అంగీకరించింది. అరెస్టు చేసిన మూడవ వ్యక్తి మక్కన్ సింగ్‌ను పరిపాలన విడుదల చేసింది.