Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల ఒత్తిడితో తలొగ్గిన కేంద్రం
- వయోజనులందరికీ ఉచిత టీకా...
- 21 నుంచి అమలు
- ప్రయివేటు వ్యాక్సినేషన్ ఉంటుంది : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సిన్ విధానానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు, సుప్రీం కోర్టు నుంచి విమర్శలు రావడంతో మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దేశంలోని 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.. ఈ నెల 21 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు.. సోమవారం జాతినుద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, కరోనా వ్యాక్సిన్లను సేకరించే బాధ్యత మొత్తం కేంద్రానిదేనన్నారు. వ్యాక్సిన్‌ను కేంద్రమే నేరుగా కొను గోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుం దని అన్నారు. అదే సమయంలో ప్రయివేటు వ్యాక్సి నేషన్ కూడా కొనసాగించు కోవచ్చ న్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 25 శాతం ప్రయివేటు ఆస్పత్రులు కొనుక్కోవచ్చని ఆయన తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రులు ఒక్కో డోసుకు సర్వీస్ ఛార్జి గరిష్టంగా రూ.150 దాకా వసూలు చేసుకోవచ్చన్నారు. కేంద్ర వ్యాక్సిన్ విధానాన్ని మార్చాలని, వ్యాక్సిన్ సేకరించి అందరికీ ఉచితంగా అందించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పదకొండు బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు బాసటగా నిలవడం, సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం, ఇది కేంద్ర- రాష్ట్రాల మధ్య వివాదంగా మారడం వంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియ చేపట్టి నవంబర్ నాటికి 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. సొంత ఖర్చుతో టీకా వేసుకోవాలనుకునేవారికి ప్రైవేటులో అవకాశం ఉంటుందని అన్నారు. ప్రపంచం లోని అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఆధునిక కాలంలో ఇలాంటి ఈ తరహా మహమ్మారిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో దేశం కఠిన పోరాటం చేస్తోందని, కరోనా వల్ల ఎంతోమంది ఆప్తులను కోల్పోయారన్నారు. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారని, ఇలాంటి మహమ్మారిని గతంలో చూడలేదు...వినలేదని అని అన్నారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందని, తక్కువ సమయంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు వైమానిక, నౌకా, రైల్వే సేవలు వినియోగించుకున్నామన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయని, కరోనా అదశ్య శక్తితో పోరాటంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించడమే మనకు రక్ష అని అన్నారు. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ తయారు చేసుకోకుంటే పరిస్థితి ఏమిటి? మనం వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి వచ్చేందుకు ఏళ్లు పట్టేదని పేర్కొన్నారు. గతంలో టీకాల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, మిషన్ ఇంద్ర ధనస్సు ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రారంభించామని అన్నారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డామని, మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారు చేశారని తెలిపారు. ఇప్పటివరకు 23 కోట్ల డోసులు పంపిణీ చేశామని, తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యామని అన్నారు.ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.