Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :దేశంలో ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా వ్యాక్సిన్లపై వసూలు చేసే గరిష్ట ధరను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కొవిషీల్డ్ ధర రూ. 780గా, కొవాగ్జిన్ ధర రూ. 1410 గా, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ను రూ.1,145గా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ధరలను విడుదల చేసింది. దీనిలో పన్నులతో పాటు ఆస్పత్రులు వసూలు చేసే సర్వీస్ ట్యాక్స్ రూ. 150 కూడా కలిపి ఉందని తెలిపింది. ప్రయావేట్ ఆస్పత్రులు రూ. 150ని మించి వసూలు చేయడానికి రాష్ట్రాలు అనుమతించవద్దని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అలాగే ప్రయావేట్ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వాలకు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించింది. ఎక్కువ ధర వసూలు చేసినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.