Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు, ఆ రాష్ట్రంలోని అమరీందర్‌సింగ్ ప్రభుత్వం గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. గతకొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనల్లో పంజాబ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దాంతో మోడీ సర్కార్ పంజాబ్ రైతుల పట్ల కక్షసాధింపు చర్యలకు తెరలేపిందని ఆరోపణలు వెలువడుతు న్నాయి. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో 132 లక్షల టన్నుల గోధుమ కొనుగోళ్లకు కేంద్రం అనేక అడ్డంకులు సృష్టించిందని సమాచారం. గ్రామీణాభివృద్ధి నిధి నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఆపేసింది. ఈ విషయం రాజకీయంగా దుమారం రేపుతోంది. పంట కొనుగోళ్ల అంశంపై స్థానిక మీడియాలో వార్తా కథనాలుగా వెలువడ్డాయి. దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న సంగతులు ఈ విధంగా ఉన్నాయి. నూతన సాగు చట్టాలకు వ్యతి రేకంగా రాష్ట్ర రైతులు ఆందోళనకు దిగటాన్ని కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. కక్షసాధింపు చర్యలకు తెరలేపింది. ప్రతిఏటా రాష్ట్రానానికి గోధుమ కొనుగోళ్ల నిమిత్తం, ఎఫ్‌సీఐ నుంచి నిధులు మంజూరవుతాయి. వీటిని ఆర్డీఎఫ్ (రూరల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులుగా పేర్కొంటారు. మార్కెట్ యార్డ్ల నిర్వహణ, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, విపత్తు నిర్వహణ, పాఠశాలల ఏర్పాటు..ఇలా గ్రామాల్లో దేనికోసమైనా ఈ నిధుల్ని రాష్ట్రాలు ఖర్చు చేయవచ్చు. రకరకాల సాంకేతిక కారణాలు చూపి ఆర్డీఎఫ్ నిధుల్ని పంజాబ్‌కు రాకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎం అమరీందర్ సింగ్ కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నారు. దీనిపై చర్చించడానికి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్ ఢిల్లీ పర్యటన కూడా చేసి వచ్చారు. సంబంధిత కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో పలుమార్లు చర్చల అనంతరం 1శాతం ఆర్డీఎఫ్ విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించిందట.