Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే దేశంలోని పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ అందజేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ప్రయి వేటు రంగానికి 25శాతం వ్యాక్సిన్లు కేటాయిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను పొలిట్‌బ్యూరో తప్పుబట్టింది. ఈ నిర్ణయం వల్ల దేశంలో ధనికులు మాత్రమే వ్యాక్సిన్ పొందే అవకాశముం టుందని, పేదలకు వచ్చేసరికి వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుందని తెలిపింది. భారత్‌లో తయారయ్యే కరోనా వ్యాక్సిన్ అంతా కూడా కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచించింది. వ్యాక్సిన్ విధానంపై సోమవారం ప్రధాని మోడీ జాతిను ద్దేశించి మాట్లాడారు. 75శాతం వ్యాక్సిన్లు కేంద్రం సేక రించి రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని, మిగతా 25శాతం ప్రయివేటు రంగం వారు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ విధానం ఔషధ తయారీ సంస్థల లాభార్జనకు, దేశంలో వ్యాక్సిన్ కొరత నెలకొనడానికి దారితీస్తుందని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఈ అంశంపై మంగళ వారం సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. గతంలో కేంద్రం ప్రకటించిన 'ఉదారవాద వ్యాక్సిన్' విధానం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు, అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల దృష్టి మరలించడానికి రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఆరోపణలు చేయటం బెడిసికొట్టింది. ఈ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇంత జరిగినా పాత విధానాన్ని కేంద్రం పూర్తిగా వదిలేయలేదు. 25శాతం వ్యాక్సిన్లు ప్రయివేటురంగానికి రిజర్వ్ చేయటాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రయివేటు ఔషధ తయారీ కంపెనీలు దోచుకోవడానికి కేంద్రం చేసిన ప్రకటన దోహదపడుతుంది. కరోనా మూడో వేవ్ నుంచి దేశాన్ని రక్షించాలంటే వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ అంతా కేంద్రమే బాధ్యతగా చేపట్టాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.