Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు
- ఆరువారాల్లోగా స్పందించాలని ఆదేశం
భోపాల్ : మతఘర్షణలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిం దంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులోని ఇండోర్ బెంచ్ నోటీసులిచ్చింది. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి సంబంధించి నిధులు సేకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇండోర్, ఉజ్జయిని, మాందసౌర్ జిల్లాల్లో తలెత్తిన మత ఘర్షణలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటీసులపై ఆరు వారాల్లోగా స్పందనను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మూక దాడులు, మత ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలంటూ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ మొహ్మద్ రఫీ, జస్టిస్ సుజరు పౌల్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. గతేడాది డిసెంబర్లో మూడుసంస్థలు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిం చేందుకు యత్నించాయి. విరాళాల సేకరణ మత ఘర్షణలకు దారితీసిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఇండోర్, మాందసౌర్, ఉజ్జయినిలో మత ఘర్షణలు జరిగాయని తెలిపారు. అయితే ప్రభుత్వం ఈ ఘర్షణలపై స్పందించలేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.