Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మకానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
- నిటి ఆయోగ్ సిఫార్సు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణపై మోడీ సర్కార్ చర్యలు వేగ వంతం చేసింది. ఇప్పటికే పలురంగాల్లోని ఆయా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసిన మోడీ ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ, అమ్మక ప్రక్రియను షురూ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ కసరత్తు ముమ్మరం చేసింది. మోడీ సర్కార్ రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ, ఒక బ్యాంకు అమ్మకం చేయాలని భావిస్తున్నది. కేంద్ర బడ్జెట్లో ప్రయివేటీకరణ అంశానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉన్న ప్రభుత్వ వాటాలను, పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నిటి ఆయోగ్ నివేదించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాను అమ్మేయాలని సూచించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరణ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. అంతేకాదు ఒక బీమా సంస్థను కూడా 2020-2021 ఆర్థిక సంవత్సరంలోనే ప్రయివేటీకరణ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రభుత్వరంగ సంస్థల పాలసీలో భాగంగా ఏ సంస్థలను విలీనం చేయొచ్చు, ఏ సంస్థలను ప్రయివేటీకరణ చేయొచ్చు, ఏ సంస్థలను మరో సంస్థ కింద సబ్సిడరీగా చేర్చొచ్చు అనే అంశాలపై పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని నిటి ఆయోగ్‌ను కోరింది. అలాగే వ్యూహాత్మక రంగంలోని ఆయా సంస్థల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిటి ఆయోగ్ సూచించగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏకంగా అమ్మకానికే పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నిటి ఆయోగ్ సూచనలతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం, ఆర్థిక సేవల విభాగం నిటి ఆయోగ్ ప్రతిపాదనలను పరిశీలించనున్నాయి. బ్యాంకుల ప్రయివేటీకరణకు ఏమైనా చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందా అన్న అంశంపై పరిశీలించి.. చర్చలు చేపట్టనున్నది. అయితే ఈ చట్ట సవరణలు చేసిన తరువాత బ్యాంకుల ప్రయివేటీకరణ ఘట్టం ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా చర్చించాలని అధికారులు చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ చేయడం బహుళ చర్యల ప్రక్రియ. కేబినెట్ సెక్రటరీ నేతత్వంలోని కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలు సూచిం చిన పేర్లను క్లియర్ చేసిన తరువాత, ఈ ప్రతిపాదన ఆమో దం కోసం ప్రత్యామ్నాయ మెకానిజం (ఏఎం)కు వెళుతుంది. చివరికి ప్రధాన మంత్రి నేతత్వంలోని కేంద్ర మంత్రి వర్గం తుది ఆమోదం కోసం వెళుతుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రయివేటీకరణ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలనూ ప్రయివేటీకరించాలని ప్రణాళి కలు రచించింది. ఇప్పటికే బీపీసీఎల్‌ను ప్రయివేటీకరిస్తు న్నట్టు ప్రకటించింది. అలాగే ఎయిర్ ఇండియాను విక్రయించాలని భావిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోని వంద శాతం వాటాలను అమ్మేసినట్టు ప్రకటించింది.