Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ చైర్మెన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని వచ్చే తొమ్మిది మాసాల పాటు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా మోడీ సర్కార్ సంస్థలోని వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్నీ 2022 మార్చి 13 వరకు పొడిగించినట్టు తెలుస్తోంది. ఐపీఓ కోసం మోడీ సర్కార్ 60 ఏండ్ల నాటి ఎల్ఐసీ చట్టంలో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా.. రూ.32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.