Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత్-చైనా దేశాల మధ్య వాణిజ్యం మెరుగ్గానే కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం భారత్.. చైనా నుంచి భారీ స్థాయిలో వైద్య పరికరాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 70 శాతం కంటే అధికంగా పెరిగిందని తాజాగా చైనా కస్టమ్స్ డేటా పేర్కొంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో వాణిజ్యం 48 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని తెలిపింది. ఇది అద్భుతమైన వృద్ధి అంటూ పేర్కొన్న చైనా మీడియా.. భారత్-చైనాల సరిహద్దు ఘర్షణలు, రాజకీయ విభేధాలు ఉన్నప్పటికీ.. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో స్థితిస్థాపకతకు సంకేతంగా ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదల ఉందని వ్యాఖ్యానించింది.
''భారత్-చైనా మధ్య వాణిజ్యం ఈ ఏడాది ఐదు నెలల్లో అమెరికా డాలర్ పరంగా 70.1 శాతం పెరిగి 48.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రత్యేకంగా భారత్‌కు చైనా ఎగుమతులు జనవరి నుంచి మే వరకు (ఇయర్ ఆన్ ఇయర్) 64.1 శాతం పెరిగాయి. దిగుమతులు 90.2 శాతం పెరిగారుయని చైనా కస్టమ్స్ డేటా ద్వారా తెలుస్తోందని'' గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
ఇతర దేశాలతో కంటే చైనా భారత్‌తో చేసిన వాణిజ్య పరిమాణం అధికంగా ఉందని తెలిపింది. గత రెండు నెలలుగా విజృంభించిన కరోనా మహమ్మారికి వ్యతిరేక పోరాటం కోసం భారత కంపెనీలు చైనా నుంచి వైద్య వస్తువులు, ఇతర పరికరాలు భారీ స్థాయిలో దిగుమతుల చేసుకోవడంతో ఈ పెరుగుదలకు కారణం కావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020లో భారత్-చైనా వాణిజ్యం 5.6 శాతం క్షీణించి 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2017 తర్వాత అత్యంత కనిష్టం. కానీ, అమెరికాను అధిగమించి భారత్ చైనా వాణిజ్య భాగస్వామిగా నిలిచింది.