Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిడిలో అమెరికా పాలనా యంత్రాంగం
- జాన్సన్ అండ్ జాన్సన్ డోసుల ఎగుమతికి అడ్డంకులు !
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండటంతో పాటు మరణాలు సైతం రికార్డు స్థాయిలో చోటుచేసుకుంటన్నాయి. అయితే, కరోనా కట్టడి, మరణాలను తగ్గించాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం.. అందరికీ కరోనా టీకాలు అందించడం. అయితే, కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా.. టీకాల అన్ని దేశాలకు తగినంతగా అందడం లేదు. భారీ స్థాయిలో టీకాలు ఉత్పత్తి చేస్తున్న భారత్ లాంటి దేశాలు సైతం టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదిలావుండగా, టీకాలు అందించడానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది టీకాలు ఎక్స్పైరీకి చేరువవుతున్న దారుణ పరిస్థితులకు దారితీస్తోంది. దీనికి ఉదాహరణే అభివృద్ధి చెందిన పలు దేశాల వద్ద నిల్వ ఉన్న కరోనా టీకాలు. ఇప్పుడు ఆ టీకాలు ఎక్స్పైరీ కాకముందే ప్రజలకు అందించడానికి నిల్వ ఉన్న ఆస్పత్రులు, పరిపాలన విభాగాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ముఖ్యంగా ఈ నెలలో ఎక్స్పైరీ కానున్న జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఇతర దేశాలకు పంపిణీ చేయడం లేదా వినియోగించే విషయంలో అగ్రరాజ్యం అమెరికా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికా ఇదివరకు పలు కారణాలతో జేజే టీకాను నిలుపుదల చేసి.. వారం తర్వాత పునరుద్ధరించింది. అయితే, జేజే స్టాక్ అలాగే మిగిలిపోయింది. అలాగే, ఫైజర్, మోడర్నా టీకాలు సైతం అమెరికా వద్ద పెద్ద సంఖ్యలోనే నిల్వ ఉన్నాయి. వీటిని ఆరు నెలల్లోపు ఉపయోగించకపోతే ఎక్స్పైరీ అవుతాయి. ఇప్పటికే ఫిలడెల్ఫియాలో 42 వేల జేజే డోసులు గడువు ముగిశాయి. పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా, ఓక్లాహౌమా, అర్కాన్సాస్లలో నిల్వ ఉన్న లక్షలాది జేజే కరోనా డోసులు ఈ నెలలో గడువు ముగియనున్నాయి. సీడీసీ డేటా ప్రకారం..21.4 మిలియన్ల జేజే డోసులలో సగం మాత్రమే వినియోగించారు. అలాగే, ఫైజర్, మోడెర్నా డోసులు 83 శాతం వినియోగించారు.
మిగతా డోలుసు గడువు ఈ నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే షెల్స్ జీవితకాలాన్ని పొడిగించే దానిపై అధ్యయనం కొనసాగుతోందని ఓ ప్రతినిధి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ టీకాల వృధాను అరికట్టడానికి ఆ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయవచ్చా అని యూఎస్ ప్రభుత్వాన్ని అడిగాయి. అయితే, అలా చేయడం వల్ల ముఖ్యమైన లాజిస్టికల్, చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ పేర్కొంది. ఎందుకంటే వ్యాక్సిన్లను గడువులోపు ఉపయోగించలేక పోవచ్చుననీ, ఎక్స్పైరీ తేదీలు కీలకంగా ఉంటాయని తెలిపింది.