Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరల పెరుగుదల నిరాటంకంగా కొనసాగుతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటి పరుగులు పెడుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు, సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కారు పెట్రో ధరలను అదుపు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.చమురు సంస్థలు పెంచిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.56, డీజీల్ ధర రూ. 86.47కు ఎగబాకాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.76కు, డీజీల్ ధర రూ. 86.47కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.94గా, డీజీల్ ధర రూ. 91.15గా నమోదైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.52కు, డీజీల్ ధర రూ. 89.32కు ఎగబాకింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సిటీలో పెట్రోల్, డీజల్ ధరలు దేశంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 106.64 ఉండగా, డీజీల్ ధర రూ. 99.50గా నమోదై ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 99.31గా నమోదు కాగా, డీజీల్ ధర రూ. 94.26కు పెరిగింది. గత నెల 4 నుంచి దేశంలో ఇంధన ధరలు 22 సార్లు పెరగడం గమనార్హం.