Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ, మోడీ సర్కార్ మాత్రం అన్నదాతలపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. కేంద్రం ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస మద్దతు ధర అంతా జుమ్లా అని విమర్శించింది. కాంప్రహెన్సివ్ కాస్ట్ సి2+ పెట్టుబడికి కనీసం 50 శాతం పెంచి ఎంఎస్పీని ప్రకటించడానికి బదులు, పెయిడ్ అవుట్ కాస్ట్స్+ ఫ్యామిలీ లేబర్ అంచనా వేసిన విలువను ఉపయోగించుకునే పాత ఉపాయాలను ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించింది. దీనిని ఏ2+ అని పిలుస్తారని తెలిపింది. రైతుల విషయానికొస్తే ఇది అర్థరహితమైనదనీ విమర్శించింది.నిరసన తెలుపుతున్న రైతులు మూడు వ్యవసాయ చట్టాల్లో లోపాలను ఎత్తిచూపితేనే తిరిగి చర్చలు ప్రారంభిస్తామని నిటి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ పేర్కొన్నారనీ, 2021 జనవరి 22 వరకు ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన పదకొండు రౌండ్ల చర్చల్లో ఆ చట్టాల్లో లోపాలనే ఎత్తిచూపామని ఎస్కేఎం తెలిపింది.ఈ చట్టాల్లో ప్రాథమిక లోపాలున్న విషకీëఆన్ని ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించామని ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్, అభిమన్యు కోహార్ తెలిపారు. అటువంటి ప్రాథమిక లోపాలతో ఉన్న చట్టాలను మెరుగుపరచడం సాధ్యం కాదని, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటన విరుద్ధంగా ఉందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనీ, రైతులందరికీ ఎంఎస్పీకి హామీ ఇచ్చే కొత్త చట్టాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారని ఎస్కెఎం నేతలు స్పష్టం చేశారు.