Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క భారత్‌లోనే కనిపిస్తుంది
- ఆహార కల్తీ కేసులో సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ : ''ఆరోగ్య సమస్యల పట్ల ఉదారంగా ఉండడం ఒక్క భారత్‌లోనే కనిపిస్తుంది'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోధుమలకు రంగు వచ్చేందుకు తినడానికి వినియోగించకూడని బంగారపు వర్ణాన్ని ఉపయోగిస్తున్నారన్న కేసులో నిందితులైన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకి చెందిన ప్రవార్ గోయల్, వినీత్ గోయల్ ముందస్తు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన వెకేషన్ బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.
ఆహార కల్తీ నేరానికి శిక్షా నిబంధనలు బెయిల్ ఇవ్వదగినవేనని, ముందస్తు బెయిల్‌కు తన క్లయింట్లు అర్హులేనని పేర్కొంటూ వారి తరపున న్యాయవాది పునీత్ జైన్ వాదించారు. దానిపై జస్టిస్ షా స్పందిస్తూ, 'మనదేశంలోనే ఇటువంటి ఆహార సమస్యల పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటాం. కల్తీ చేయబడిన ఆహారాన్ని మీరు తింటారా? దీనికి సమాధానం చెప్పండి' అని జైన్‌ను ప్రశ్నించారు. ముందస్తు బెయిల్‌ను పరిశీలించేందుకు బెంచ్ తిరస్కరించడంతో దాన్ని ఉపసంహరించుకోవాలని న్యాయవాది నిర్ణయించారు. జైన్ అభ్యర్థనపై స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా భావించి కొట్టివేసినట్లు బెంచ్ పేర్కొంది.