Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా నిర్లక్ష్యంగానే కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కొరల్లో చిక్కుకున్నది. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్‌తో భారత్ కకావికలమవుతున్నది. కనీస వైద్య సౌకర్యాలు అందక లక్షలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. రెండో వేవ్ ప్రమాదం పొంచి వుందని నిపుణులు హెచ్చరించినా.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. దీనిపై మోడీ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వైద్య సౌకర్యాలు, వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యం వెరసి.. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కరోనా మహమ్మారి అన్ని వ్యవస్థలకూ సవాలుగా నిలిచింది.కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిమీటర్లు, ఎన్-95 మాస్క్‌లు, థర్మామీటర్లు, ఔషధాలు సహా అనేక వైద్య పరికరాలు, మందులు రికార్డు ధరలకు విక్రయించబడుతున్నాయి. పరిస్థితులపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణితో ముందుకు సాగుతోంది. ఇదివరకే వైద్య సామగ్రి, కరోనా టీకా ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ధరలు నిర్ణయించే అధికారాన్ని ప్రశ్నిస్తూ.. చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని న్యాయస్థానాలు ఇదే విషయంపై ప్రభుత్వాల తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కాగా, ధరల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నా పాలకులు దానికి అనుగుణంగా అడుగులు వేయటంలేదు. అయితే, కేరళ సర్కార్ ఈ విషయంలో మెరుగైన పనితీరును ప్రదర్శించింది.