Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధరల పెంపు
- వరికి రూ.72 మాత్రమే
- మొక్కజొన్నకు కేవలం రూ.20
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పం టల కనీస మద్దతు ధరల ను (ఎంఎస్పీ) కేంద్రం ఖరారు చేసింది. వరి, నువ్వులు, కంది, మిను ములు, పెసర, వేరుశనగ, జొన్న, సన్‌ప్లవర్, సోయా బీన్ (ఎల్లో), మొక్కజొన్న తదితర పంటలకు ఎంఎస్పీ ప్రకటించింది.
వరికి కేవలం రూ.72 మాత్రమే పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కనీస మద్దతు ధరలను ఆమోదించారు. 2021-22 మార్కెట్ సీజన్‌కు ఈ ధరలు వర్తిస్తాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరాలను వెల్లడించారు.
ధాన్యం క్వింటాకు రూ.72 మేర పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.1,868 ఎంఎస్పీ ఉంది. దాన్ని రూ.1,940కుపెంచింది. 'ఏ' గ్రేడ్ ధాన్యం క్వింటాకు ప్రస్తుతం రూ.1,888 ఉంది. దాన్ని రూ. 1,960కి పెంచారు. క్విం టా నువ్వులకు కనీస మద్దతు ధరను రూ.452 మేర పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటా కంది, మినముల కనీస మద్దతు ధరను కూడా రూ.300 మేర పెంచింది. కంది, మినప క్వింటా ప్రస్తుతం రూ.6,000 ఉంటే, దాన్ని 6,300కు పెంచింది. పెసరకు ప్రస్తుతం క్వింటా రూ.7,196 ఉంటే, దానికి రూ.79 పెంచి, రూ.7,275 వద్ద కనీస మద్దతు ధర నిర్ణయించింది. వేరుశెనగకు ప్రస్తుతం క్వింటా రూ.5,275 ఉంటే, దానికి రూ.275 పెంచి రూ.5,550 ఎంఎస్పీగా ప్రకటించింది. సన్ ప్లవర్ ప్రస్తుతం ధర రూ.5,885 ఉంటే, రూ.130 పెంచి, రూ.6,015గా, సోయాబీన్ (ఎల్లో) ప్రస్తుతం ధర రూ.3,880 ఉంటే, దానికి రూ.70 పెంచి, రూ.3,950 వద్ద ఎంఎస్‌పిగా నిర్ణయించింది. పత్తి (మీడ ియం స్టాప్‌లే) క్వింటా ధర ప్రస్తుతం రూ.5,515 ఉండగా, దానికి రూ. 211 పెంచి, రూ. 5,726 వద్ద ఎంఎస్పీ నిర్ణయించింది. పత్తి (లాంగ్ స్టాప్‌లే) క్విం టా ధర ప్రస్తుతం రూ.5,825 ఉండగా, దానికి రూ.200 పెంచి, రూ. 6,025 వద్ద ప్రకటించింది. క్వింటా జొన్నకు ప్రస్తుతం రూ. 2,150 ఇస్తుం డగా.. దానికి రూ.100 పెంచి, రూ.2,250 వద్ద ధర నిర్ణయించింది. కింట్వా మొక్కజొన్నకు ప్రస్తుతం రూ.1,850 ధర ఇవ్వగా, దానికి రూ.20 పెంచింది. రూ.1,870 వద్ద కనీస మద్దతు ధర నిర్ణయించింది. భవిష్యత్ లోనూ ఈ ధరలు కొనసాగుతాయని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
రైల్వే సిగలింగ్ వ్యవస్థ బలోపేతానికి పచ్చజెడా
ఇండియా రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగలింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రైల్వేలకు 700 మెగాహెర్జ్ట్ బ్యాండ్‌లో ఐదు మెగాహెర్జ్ట్ స్ప్రెక్టమ్‌ను అందిస్తామని, దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థను ఉపయోగి స్తున్నారనీ, దీని స్థానే స్ప్రెక్టమ్ వాడితే రేడియో కమ్యూనికేషన్ చాలా మెరు గుపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.25,000 కోట్లు ఖర్చు చేయ నుందన్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని, ప్రస్తుతం రైల్వే శాఖ కమ్యూనికేషన్లు, సిగలింగ్ కోసం ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌పై ఆధార పడుతోందని అన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపు వల్ల కమ్యూనికేషన్ల వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.
నూతన పెట్టుబడి విధానానికి ఆమోదం
ఎరువుల విభాగం తీసుకువచ్చిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహా రాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ప్రకారం 2014 అక్టోబరు 7 నాటి సవరణ సహితంగా నూతన పెట్టుబడి విధానం (ఎన్ఐపీ)-2012 ఇకపై రామగుండం ఫర్టిలైజర్స్ ఎండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) విషయంలో కూడా వర్తింపులోకి రానుంది.