Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వేలాది మంది రైతులు
న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు గత కొన్నిరోజులుగా భారీగా అన్నదాతలు తరలివస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకున్నారు. గురువారం హర్యానా నుంచి ఆందోళన ప్రాంతాలకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. రైతు ఉద్యమం గురువారం నాటికి 196వ రోజుకు చేరింది.
రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించాలి : ఎస్కెఎం
వ్యవసాయానికి జవాబుదారీతనం కోసం, రైతులకు సంబంధించిన విధానాలను రాష్ట్రస్థాయి లో పరిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) కోరింది. ఈ మేరకు ఎస్కెఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్, అభిమన్యు కోహార్ సంయుక్తంగా గురువారం ప్రకటన విడుదల చేశారు. అందువల్ల రాష్ట్రస్థాయిలో విధానానికి, చట్టాన్ని రూపొందించడానికి అధికారం లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ చట్టాల ఆమోదంలో రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ అధికా రాన్ని కేంద్ర ప్రభుత్వం అతిక్రమించడాన్ని తమ ఉద్యమం ప్రతిఘటిస్తుందని అన్నారు. రాష్ట్ర చట్టాల ను సవరించనున్నట్లు మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎపిఎంసిలను రక్షించడం, ఉత్పత్తిదా రుల ప్రయోజనాలను పరిరక్షించడం, రైతుల మనోవేదనలను పరిష్కరించడం ఈ సవరణలని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాలలో తగిన సవర ణలు చేయడం, రైతుల ప్రయోజనాలను పరిరక్షించ డం, ఎపిఎంసిలను బలోపేతం చేయడం స్వాగతిం చదగినదని ఎస్కెఎం నేతలు అన్నారు. కేంద్ర చట్టా లను వెనక్కి నెట్టేలా చూడటానికి రాష్ట్ర చట్టాలలో ఇటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను బలోపేతం చేయడంతో పాటు, తగిన బడ్జెట్లతో పాటు అనేక ఆవిష్కరణలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు.
కేరళలో పాడైన పంటలకు ఎంఎస్పి
కేరళ ప్రభుత్వం పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్పి అందిస్తోందని నేతలు ఉదహరించారు. నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని, ఈ చట్టాలు ఏ రూపంలోనూ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అందువల్లే ఎంఎస్పికి చట్టపరమైన హామీని కోరుతున్నప్పటికీ, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు పట్టుబడుతున్నారని ఎస్కెఎం నేతలు పేర్కొన్నారు.