Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను మరోసారి వేలానికి పెట్టింది. గురువారం 32 ప్రాంతాల్లోని 75 చమురు, గ్యాస్ నిక్షేపాలున్న క్షేత్రాలను వేలానికి పెట్టినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆనంద్ గుప్తా వెల్లడించింది. ఇందులో 54 లోతులేని నీటిలోనివి కాగా.. 2 మాత్రం అతి నీటి లోతులో నివి, మరో 19 భూమిపై కలవని తెలిపారు. చమురు దిగుమతిలో ప్రపం చంలోనే భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉన్నది. ఇంతక్రితం రెండు వేలాల్లో 54 ప్రాంతాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.