Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ జూన్ 12న (రేపు) భేటీ కానున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ముఖ్యంగా కరోనా సంబంధిత అత్యవసర ఉత్పత్తులు, బ్యాంక్ ఫంగస్ ఔషదాలపై పన్ను తగ్గింపునపై నిర్ణయాలు జరుగొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం మే 28న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని పలు రాష్ట్రాల మంత్రులు కోరారు. దీంతో రేపు జరగనున్న భేటీలో నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్‌పై 5 శాతం జీఎస్టీ, ఈ రోగ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం పన్ను అమల్లో ఉంది.