Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం దిశగా ముందుకు : ఏపీ సీఎం
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్, పునరావాస పనులను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో ఏపీ ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ సవ రించిన అంచనా వ్యయం 55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. జాతీయ ప్రాజెక్ట్‌ల విషయంలో నీటి సరఫరా...ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చూడాలనీ, పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్రప్రభుత్వ వనరుల నుంచి ఖర్చు చేస్తున్నామనీ.. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌వైజ్ ఎలిజిబిలిటీకి పరిమితం చేయొద్దన్నారు. పునరావాస పనులకు కూడా రీయింబర్స్ చేయాలనీ, పోలవ రం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని...హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కేంద్రమంత్రి జవదేకర్, నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్‌ను ఏపీ సీఎం కలిసి పలు వినతులు అందజేశారు.