Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాత నెత్తిన శిరోభారంలా సాగుపెట్టుబడులు
- ఏడాదిలో డీజిల్ ధర పెంపు 35 శాతం.. ఎంఎస్పీ 4 శాతంలోపే
రైతులకు కష్టంలేకుండా చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు దాటాక కూడా మోడీ సర్కార్‌లో చలనం కనిపించటంలేదు. వ్యవసాయరంగ నిపుణులు స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామనీ, అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుమ్మరించింది. కానీ, ఆచరణలో అవి ఏ ఒక్కటీ అమలుకాలేదు. కరువు, అకాల వర్షాలు ఇలా ప్రకృతి రైతు బతుకును ఛిద్రం చేస్తూనే ఉన్నది. ఊహించని విధంగా పెరిగిపోతున్న పెట్టుబడులు, మరోవైపు అంతులేకుండా పెరిగిపోతున్న డీజిల్ ధరలూ అన్నదాతను నిట్టనిలువునా ముంచుతున్నాయి. కంటితుడుపు చర్యలా పెంచిన ఎంఎస్పీతో బతికేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు రైతును సాగుభూముల్లో నుంచి ఎలాగైనా తరిమికొడితే.. సాగంతా కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకెళ్లటమే తమ లక్ష్యమన్నట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
న్యూఢిల్లీ : కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తమ తలరాతలు మాత్రం మారటంలేదని రైతులు మొత్తుకుంటున్నారు. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. వరి ఎంఎస్పీ (జనరల్) గత ఏడాది క్వింటాల్‌కు రూ.1,868 నుంచి క్వింటాల్‌కు రూ.1,940లకు పెంచింది. అంటే రూ.72 రూపాయలు మాత్రమే. దీనిపై అన్నదాతల కడుపురగలిపోతున్నది. ఎడా పడా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. వరి సాగు వల్ల ఇక లాభంలేదని పరిస్థితి నెలకొన్నది. విద్యుత్తు ద్వారా మాత్ర మే వరిని పండించటం వల్ల ప్రయోజనం ఉంటుందనీ, డీజిల్పంప్ మోటార్ల మీద ఆధారపడితే నిట్టనిలువున రైతు లు మునిగిపోతారని రైతుసంఘాల నేతలు అంటున్నారు.
వరిసాగుకు కావాల్సిన డీజిల్..
ఒక బిగా (1.67 ఎకరాలు) వరిపంట వేస్తే..దానికి వినియోగించే మోటార్లకు 100 లీటర్ల డీజిల్ వినియోగించాలి. ప్రస్తుతం డీజిల్ లీటరుకు రూ.96 ను దాటింది. మొత్తం మీద డీజిల్ కోసం రూ.9,600 ఖర్చు పట్టాలి. ఆ తర్వాత నాట్లు వేయటం, పొలం దున్ను టం, క్రిమిసంహారమందులు చల్లటం, వంటి పనులకు మరో రూ.8,000లు ఖర్చువుతాయి. ఇంతశ్ర మపడి పెట్టుబడి సమకూర్చినా.. ఒక బిగా పొలంలోవచ్చేది కేవలం ఏడును ంచి ఎనిమిది క్వింటాళ్ల ధాన్యం మాత్రమే. ఒకవేళ 8 క్విం టాళ్లు ధాన్యం వచ్చినా.. కొత్త ఎంఎస్పీప్రకారం ధాన్యం ధర రూ.15,520. మరోవైపు వ్యవసాయానికి వినియోగించే డీజిల్ ఖర్చు రూ.17600 అవుతుంది. ఈ లెక్కన కనీసమద్దతుధర(ఎంఎస్పీ) కన్నా ఎక్కువే. అంతిమంగా రైతు నష్టపోతున్నాడని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.
విద్యుత్ కోతలు కూడా..
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు గిట్టుబాటుధర సరికదా.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావటంలేదు. దీనికి తోడు పల్లెల్లో వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులపాటు .. పదిగంటలకుపైగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిరోసిన్ పోసి మోటార్లు నడుపుతున్నామంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కిరోసిన్ కూడా లీటర్ రూ.30 నుంచి 40 వరకూ విక్రయిస్తున్నారు. వరిపంటను కాపాడుకోవటానికి అవసరమైన నీటిని వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నట్టు వారు చెబుతున్నారు.
ఏడాదిగా పెరగని ఎంఎస్పీ.. డీజిల్‌పై బాదుడే
గత ఏడాది కాలంగా ఎంఎస్పీపై నాలుగు శాతం కూడా పెరగలేదు. కానీ డీజిల్‌పై ఏకంగా 35 శాతం ఖరీదైపోయింది. 2020 జూన్ 10న డీజిల్ లీటర్ రూ.71 కాగా..ఇపుడు రూ.96కి పైనే చేరిందని రైతు ధర్మేంద్ర శర్మ తెలిపారు.
డీజిల్‌పై కేంద్రం భారీపన్నులు
కేవలం కేంద్రం విధించే పన్లువల వల్లే చమురుధరలు ధరలు ఆకాశాన్నంటున్నాయి. దేశంలో డీజిల్ మూల ధర ఇప్పటికీ రూ.38కి దగ్గరగా ఉన్నది. కేంద్రం రూ.32 ఎక్సైజ్ సుంకం రూపంలో వసూలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలుచేసే పన్నుల భారాలు తడిసిమోపెడవుతున్నాయి. చివరకు ఎన్నడూలేని విధంగా మోడీ పాలనలో వందమార్కును పెట్రోల్ దాటేసింది. డీజిల్ కూడా రూ.100కు చేరువలో ఉన్నది. మొత్తానికి వ్యాట్, సెస్సులు వెరసి పెట్రో ధరలు మూలధర కంటే రెండున్నరెట్లు పెరిగింది.
ఈ రెండు రంగాల్లో డీజిల్ అధిక వినియోగం
రవాణా, వ్యవసాయ రంగంలో అత్యధికంగా డీజిల్ వినియోగమవుతున్నది. ధర పెరిగినప్పుడు ఈ రెండు రంగాలూ ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా, పొలంలో పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం ఖరీదైపోతున్నది.. ఇది సామాన్యులు, రైతు బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నది.
రైతులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వాలి
అన్నదాతల ఆదాయాన్ని పెంచటానికి స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఇప్పటికీ మోడీ సర్కార్ పూర్తిగా అమలుచేయలేదు. రెట్టింపు ఆదాయం సమకూ రుస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం రైతులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వాలి.దీనికోసం కేంద్రం కార్యాచరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- సీనియర్ ఆర్థికవేత్త వృందా జాగీర్దార్