Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా రెండో దశ నేపథ్యంలో రుణాల తిరిగి చెల్లింపుపై తాజా మారటోరియం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. మారటోరియంపై ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. పిల్లో లేవనెత్తిన సమస్యలు విధానపరమైన నిర్ణయాల పరిధిలో ఉన్నాయని పేర్కొంది. పిటిషన్ డిమాండ్‌ను ఆమోదించడం, తగిన ఆదేశాలు ఇవ్వడం అనేది ప్రభుత్వానికి సంబంధించిందని పేర్కొంది. గతేడాది కరోనా మొదటి దశ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) రుణాల చెల్లింపుపై మారటోరియం విధించిన విషయం తెలిసిందే. కరోనా రెండో దశ నేపథ్యంలో రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ ఆంక్షల కారణంగా నష్టపోయిన వ్యక్తులు, చిన్న వ్యాపారస్తులు, ఎంఎస్ఎంతీలకు ఆర్బిఐ గతనెల వన్‌టైమ్ లోన్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌ను పున:ప్రారంభించింది. ఇంతకుముందు ఈ అవకాశాన్ని వినియోగించుకోని, ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న రూ.25 కోట్లలోపు ఉన్న రుణాలకు ఈ రీస్ట్రక్చరింగ్ అర్హత ఉందని తెలిపింది.