Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులందరినీ అరెస్టు చేయాలి
- హర్యానా సీఎం ఖత్తర్‌కు బృందాకరత్ లేఖ
న్యూఢిల్లీ : హర్యానాలోని నుV్‌ా జిల్లాలో మే 16న చోటుచేసుకున్న ముస్లిం యువకుడు ఆసిఫ్ ఖాన్ హత్య ఘటనలో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ఆ రాష్ట్ర సీిఎం మనోహర్‌లాల్ ఖత్తర్‌ను డిమాండ్ చేశారు. హత్య ఘటన అనంతరం.. కోవిడ్-19 నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో కూడా 'హిందూ మహాపంచాయత్'ల పేరుతో సమావేశాలు నిర్వహించిన వారిని, అందులో విద్వేష ప్రసంగాలు చేసిన వారిని అరెస్టు చేయాలని పేర్కొన్నారు. ముగ్గురు చిన్న పిల్లలున్న బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఖేరా ఖలీల్పూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆసిఫ్ కుటుంబాన్ని సీపీఐ(ఎం), సీపీఐ నేతలతో కూడిన బృందం ఈనెల 9న పరామర్శించింది. ఈ బృందంలో బృందాకరత్‌తో పాటు సిపిఐ సెంట్రల్ సెక్రటేరియట్ సభ్యులు అమర్జిత్ కౌర్, సిపిఎం హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురిందర్ సింగ్, సీపీఐ కార్యదర్శి దరియవ్ కశ్యప్, తదితరులు ఉన్నారు. వీరంతా గ్రామంలో పర్యటించి హత్య ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖత్తర్‌కు బృందాకరత్ శుక్రవారం లేఖ రాశారు. ఆసిఫ్‌ఖాన్ మందుల కోసం గతనెల 16న తన సోదరుడు రషీద్‌తో కలిసి సోన్హాకు వెళ్తున్న సమయంలో కర్రలు, రాడ్లతో మూక దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆసిఫ్ మరణించగా, రషీద్ గాయాలతో బయటపడ్డాడు. దాడి ఘటనపై రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. తమను అడ్డగించిన మూక 'జై శ్రీరామ్' అని అనాలని ఒత్తిడి చేశారని, ముస్లింలందరికీ చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆసిఫ్ హత్య పక్కా వ్యూహం ప్రకారం జరిగిందని, నేరస్తుల కార్యకలాపాలను వ్యతిరేకించినందునే అతన్ని లక్ష్యంగా చేసుకున్నారని బృందాకరత్ లేఖలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది అరెస్టు చేశారని, మిగిలిన నిందితుల్ని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మే 30న సెక్షన్ 144ను ఉల్లంఘిస్తూ నూV్‌ా జిల్లా ఇంద్రి గ్రామంలో కర్ని సేన అధ్యక్షుడు సూరజ్‌పాల్ 'హిందూ మహాపంచాయత్' పేరుతో సమావేశం నిర్వహించాడని తెలిపారు. 'మతాన్ని కాపాడండి - కులాలు కూడా కాపాడబ డతాయి' అన్న సోషల్ మీడియా నినాదాన్ని చూస్తే.. హత్యకు మతం కోణం ఉందని అర్థమౌతోందని పేర్కొన్నారు.