Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వీడియోకాన్ ఇండిస్టీస్ లిమిటెడ్ (విఐఎల్)ను వేదాంత గ్రూప్‌నకు కట్టబెట్టడంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును మోడీ సర్కార్ కొల్లగొడుతోందని విమర్శిం చారు. వీడియోకాన్‌ను వేదాంత రూ. 2,962 కోట్లకు కొనుగోలు చేయ డంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. విఐఎల్ను వేదాంత కొనుగోలు చేసేందుకు అంగీకరిం చిన బ్యాంకులు సైతం రూ. 40 వేల కోట్లకు పైగా బకాయిలను మాఫీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మోడీ మద్దతు కల్గిన ఆశ్రిత పెట్టుబడుల దోపిడీ కారణంగా ప్రజల పొదుపు సొమ్మును, బ్యాంకులు 40వేల కోట్ల ఆస్తులను కోల్పోతాయని తెలిపారు. ఈ విధంగా జాతీయ ఆస్తులను, ప్రజల సంపదను కొల్లగొడుతున్నారని మోడీ సర్కార్‌ను విమర్శించారు.