Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనాసాగుతూనే ఉంది. కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటకీ.. మరణాలు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 84,332 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో వైరస్‌తో పోరాడుతూ 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 3,67,081కి పెరిగాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కు చేరింది. ఇప్పటివరకు 2,79,11,384 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు టాప్-10లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 24,96,00,304 డోసుల టీకాలు వేశారు. అలాగే, మొత్తం 37,62,32,162 కరోనా పరీక్షలు నిర్వహించారు.