Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రఫుల్‌పై వామపక్ష ఎంపీల హక్కుల నోటీసు
- లక్షద్వీప్‌కు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు
న్యూఢిల్లీ : పార్లమెంటు సభ్యులను అగౌరవ పరిచినందుకు, ఎంపీల ప్రతినిధి బందాన్ని లక్షద్వీప్ సందర్శించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌పై వామపక్ష ఎంపీలు ప్రత్యేక హక్కుల నోటీసును ఇచ్చారు. రాజ్యసభలోని వామపక్ష ఎంపీలు ఎలమారం కరీం, బినరు విశ్వం, ఎం.వి శ్రేయామ్స్ కుమార్, వి. శివదాసన్, కె. సోమప్రసాద్, జాన్ బ్రిటాస్ రాజ్యసభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 187 రూల్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోని ఎఎం ఆరిఫ్, థామస్ చాజిక్కాదన్ లోక్‌సభలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 222 కింద నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిపాలనాధికారి ఆధ్వర్యంలో లక్షద్వీప్ ప్రజలపై పరిపాలనా చర్యలు, సంస్కరణల ప్రభావంపై నిజ నిర్ధార చేయడానికి, అలాగే అక్కడి క్షేత్రస్థాయి నివేదికను రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సమర్పించడానికి వామపక్ష ఎంపీలు లక్షద్వీప్ సందర్శించాలని నిర్ణయించారు. కరోనా ఆంక్షలను పేర్కొంటూ ఎంపీల అభ్యర్థనను లక్షద్వీప్ పరిపాలన అధికారి ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. మళ్లీ రెండోసారి రాసిన అభ్యర్థన లేఖకు పరిపాలన అధికారి స్పందించలేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి నిజనిర్ధారణ నివేదికను సమర్పించడానికి ఉద్దేశించిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందాన్ని రాజకీయ కారణాల వల్ల రెండుసార్లు అడ్డుకున్నారు.