Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షద్వీప్ దర్శకురాలిపై ఆరోపణలు అవాస్తవం
- బీజేపీకి పలువురు నేతల రాజీనామా
న్యూఢిల్లీ : లక్షద్వీప్ సమస్య కీలక మలుపు తిరిగింది. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సినీ దర్మకురాలు అయేషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదుకావడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయిషాపై ఆరోపణలు అవాస్తమని పేర్కొన్నారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. లక్షద్వీప్ బీజేపీ చీఫ్ సి అబ్దుల్ ఖదీర్ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఈ రాజద్రోహం అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలో ఓ చానల్లో పాల్గన్న ఆమె...కరోనాను కట్టడి చేయడంలో ప్రఫుల్ పటేల్ విఫలమయ్యారనీ, ఆయనొక జీవాయుధమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ ద్వీప దేశంలో ప్రఫుల్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై రాజద్రోహం ఆరోపణలు నమోదుచేయడం పట్ల బీజేపీ నేతల నుంచీ వ్యతిరేక వ్యక్తం అవుతుంది.రాజీనామా చేసిన వారిలో బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ ముల్లిపుర, వక్ఫ్‌బోర్డు సభ్యుడు ఉమ్ముల్ కులూస్ పుతియపుర, ఖాదీ బోర్డు సభ్యులు సైఫుల్లా పక్కియోడ, చెత్లాట్ యూనిట్ కార్యదర్శి జబ్బీర్ సాలిహత్ మంజిల్తో సహా 15 మంది నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. రాజీమానా లేఖలను హాజీకి పంపారు. అయేషాపై ఖదీర్ హాజీ చేసిన ఆరోపణలు అసత్యాలని రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. అయేషాను, ఆమె కుటుంబ భవిష్యత్తును నాశనం చేసేందుకు ఆయన లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు.