Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌పై డాక్టర్ ఆంథోనీ ఫౌచి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరమ్ సంస్థ రూపొందించిన కొవిషీల్డ్ టీకాలను రెండు డోసుల కింద ప్రజలకు అందిస్తున్నారు. అయితే, దేశంలో గత నెలలో ప్రభుత్వం కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12 నుంచి 16 వారాలకు పెంచింది. దీనిపై అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచి స్పందించారు. వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచితే ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసుల మధ్య గ్యాప్ పొడిగించడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. కాగా, రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం వ్యాక్సిన్ ప్రభావాన్ని పెంచుతుందని ప్రభుత్వం చెబుతున్నది. అయితే వ్యాక్సినేషన్లో గ్యాప్ పెంచడానికి బదులుగా నిర్దేశిత షెడ్యూల్‌ను అనుసరించాలని ఫౌచీ సూచిస్తున్నారు. వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. డెల్టా వేరియంట్ తొలుత భారత్‌లోనే కనిపించిందనీ, ఇది సెకెండ్‌వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిందని అన్నారు. డెల్టా వేరియెంట్లు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందాయన్నారు. కరోనా థర్వేవ్కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలన్నారు. అప్పుడే కరోనా థర్డ్ వేవ్‌ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఫౌచి ప్రకటనపై దేశంలో ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఫౌచి వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.