Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్పిటల్స్, వైద్య సిబ్బందిపై దాడులను ఖండిస్తూ నిరసనబాట
- హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను పక్కాగా అమలుజేయాలి : ఐఎంఏ డిమాండ్
న్యూఢిల్లీ : వైద్యులు, హాస్పిటల్ సిబ్బందిపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈనెల 18న దేశవ్యాప్త నిరసనలకు దిగుతున్నా మని 'ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (ఐఎంఏ) ప్రకటించింది. గత కొద్దివారాలుగా అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక..తదితర రాష్ట్రాల్లో హాస్పిటల్స్‌పై, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందిపై దాడులు, హింస పెరిగాయని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభ సమయాన ప్రజల ప్రాణాల్ని రక్షించే కర్తవ్యంలో నిమగమైన వైద్య సిబ్బందిపై దాడులు జరగటాన్ని ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. 'సేవ్ ద సేవియర్స్' నినాదంతో ఈనెల 18న వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనబాట పడుతున్నారని, అన్ని రాష్ట్రాలు, అక్కడి స్థానిక బ్రాంచ్‌లలో వైద్యులు, వైద్య సిబ్బంది అంతా ఈ నిరసనలో పాల్గొంటున్నారని ఐఎంఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వారంతా నల్లబ్యాడ్జీలు, మాస్కులు, రిబ్బన్లు, షర్టులు..ధరించి నిరసన వ్యక్తం చేస్తారని ఐఎంఏ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులపై ఇటీవల చోటుచేసుకున్న దాడులు, హింస..అదంతా కూడా వైద్యుల్ని, హాస్పిటల్స్‌లో పనిచేసే సిబ్బందిని తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. వీటిని అరికట్టడానికి 'సెంట్రల్ హాస్పిటల్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ప్రొటెక్షన్' యాక్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలుజేయాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోం-ది. దాడులకు దిగినవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, హాస్పిటల్స్‌లో భద్రతా ప్రమాణాలు పటిష్టపర్చాలని ఐఎంఏ కోరుతోంది. అల్లోపతి వైద్యం గురించి యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఐఎంఏ తెలిపింది.