Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ పోటీ చేస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్‌తో పవార్ భేటీ కావడమే ఈ వార్తలకు ఆజ్యం పోసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్‌కు ప్రశాంత్ కిశోర్ సూచించారని సమాచారం. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎన్‌సిపి వర్గాల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. పార్లమెంటులో బిజెపికి బలం అధికంగా ఉండటం వల్ల ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య ఆయన పోటీ చేస్తారా? లేక ఇంకేమైనా వ్యూహం ఉందా అనేది తెలియాల్సి ఉంది.