Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు అంచనా వేసిన సమయం కంటే 15 రోజుల ముందుగానే ఉత్తర భారత దేశానికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, లఢఖ్తోపాటు ఉత్తర హర్యానా, చంఢగీడ్, ఉత్తర పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండి) వెల్లడించింది. రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని అధిక ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 3న కేరళను తాకాయి. అప్పటి నుంచి ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా రుతుపవనాలు వేగవంతమైన పురోగతితో ముందుకు వెళ్తున్నాయి. సాధారణంగా ఢిల్లీలో సీజనల్ వర్షాకాలం జూన్ 28-29 మధ్య ప్రారంభమౌతుంది. ఈ ముందస్తు పరిస్థితులకు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది రుతుపవనాలు పురోగతికి అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు.