Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపి సంజరు రౌత్ వ్యాఖ్యలు
ముంబయి : మహారాష్ట్రలో 2014-19 మధ్య సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో శివసేనను బిజెపి ఒక బానిసలా చూసిందని, ఒకానొక సమయంలో తమ పార్టీని రాజకీయంగా నాశనం చేయాలని ప్రయత్నించిందని శివసేన ఎంపి, సీనియర్ నేత సంజరు రౌత్ అన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వంలో శివసేన రెండోస్థానంలో ఉంది. మా మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా అధికార దుర్వినియోగంతో శివసేనను అంతమొందించాలని బిజెపి ప్రయత్నించింది' అని అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీతో శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మధ్య జరిగిన సమావేశానికి సంబంధించి రాజకీయపరమైన ఊహాగానాలు జరుగుతున్న సమయంలో రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో సిఎం అభ్యర్థిత్వంపై విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు దశాబ్దాల మిత్రత్వానికి ముగింపు పలుకుతూ వేర్వేరుగా పోటీచేశాయి. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం సంజరు రౌత్ మాట్లాడుతూ మోడీ ఈ దేశంలోనే అగ్రనాయకుడు అంటూ ప్రశంసలు కురిపించడం గమనార్హం.