Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గతేడాది వెలుగుచూసిన కరోనా మహమ్మారి ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. అయితే, వైరస్ మూలాలపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో వివరాలు తెలియకుండా మిస్టరీగానే ఉంది. దీనిపై అనేక దేశాలు పరిశోధనలు సాగిస్తున్నాయి. కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు తాజాగా గబ్బిలాలలో కొత్త కరోనావైరస్లు కనుగొన్నారు. గబ్బిలాలలో కొత్తగా కనిపించిన వైరస్లు.. ప్రస్తుతం పంజా విసురుతున్న కరోనా వైరస్‌కు జన్యుపరంగా ఒకేలా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. గబ్బిలాల్లో ఇంకా గుర్తించని వైరస్లు ఎన్నో మనుషులకు వ్యాపించే అవకాశముందనీ, అటువంటి రకాలపై ఒక అంచనాకు వచ్చేందుకు పరిశోధనలు సాగిస్తున్నామని వెల్లడించారు. చైనాలోని షాండాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 2019 మే నుంచి 2020 నవంబర్ వరకు అడవుల్లో ఉండే గబ్బిలాల నుంచి మలం, నోటి శ్వాబ్ నమూనాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేసినట్టు తెలిపారు. మొత్తం 24 కరోనా వైరస్ జన్యు క్రమాలను సేకరించామనీ, వైరస్లలో ఒకటి ప్రస్తుతం ఉన్న వైరస్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలిపారు. మొత్తం నాలుగు సార్స్-కోవ్-2 తరహా కరోనా వైరస్లు ఉన్నట్టు పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో థారులాండ్‌లో కనిపించిన సార్స్-కోవ్-2 తరహా వైరస్ గబ్బిలాల్లో అధికంగా వ్యాపిస్తున్నట్టు తెలిపారు.