Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెల్టా వేరియంట్‌పై సీసీఎంబీ అడ్వైజరీ
- దేశవ్యాప్త సెరోసర్వే ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన రాకేశ్ మిశ్రా
న్యూఢిల్లీ : దేశంలో ప్రమాదకర డెల్టా వేరియంట్ (బీ16172)పై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సలహాదారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డెల్టా వేరియంట్ రానున్న రెండు నెలల్లో మార్పు చెందుతుందని సీసీఎంబీ సలహాదారు అయిన డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా సెరోసర్వే నిర్వహిం చాలన్న ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడం కోసం ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో జాతీయస్థాయి సెరోసర్వేను ప్రారంభించ నున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వెల్లడించింది. జాతీయస్థాయి సెరోసర్వే కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైం దని నిటి ఆయోగ్ సమాచారం. తదుపరి సెరోసర్వే కోసం ఈ నెలలో పని ప్రారంభమవుతుందని వెల్లడించింది. కాగా, ఐసీఎంఆర్ నేషనల్ సెరోసర్వే ఇన్ఫెక్షన్ రేటును, యాంటీబాడీలను కనుగొనడానికి ఉపయోగ పడుతుందని రాకేశ్ మిశ్రా వివరించారు. '' ఇప్పటికే వ్యాక్సిన్ వేయించు కున్నవారిలో యాంటీబాడీల గురించి ఇది వెల్లడిస్తుంది. దేశంలో భారీస్థాయి సెరోసర్వే చాలా ఉపయోగకరం'' అని మిశ్రా చెప్పారు.