Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాలు పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు 3.70 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో మరణాలు మూడు వేలు పైనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 80,834 కొత్త కేసులు నమోదవ్వగా, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,303 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384కి చేరింది. తాజాగా 1,32,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,80,43,446కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 10,26,159కి చేరింది. క్రియాశీల కేసుల రేటు 3.49 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకూ 25,31,95,048 టీకా డోసులు అందించారు. ఢిల్లీలో రెస్టారెంట్లు, మార్కెట్లకు అనుమతి సోమవారం నుంచి ఢిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 14 నుంచి రెస్టారంట్లు తెరుచుకోవచ్చని అయితే, 50శాతం సామర్థ్యంతోనే వాటిని నడపాలని అన్నారు. అదే విధంగా మున్సిపల్ జోన్స్‌లో వారాంతపు మార్కెట్లకు కూడా అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇవి కాకుండా పాఠశాలలు, కాలేజ్‌లు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, సినిమా హాళ్లు, మల్టీపెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వ్యాయామ శాలలు, పార్కులను ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ మూసే ఉంచాలని ఆదేశించారు. నగరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను తెరుచుకోవ చ్చని, అయితే సందర్శకులకు అనుమతి ఇవ్వరాదని అన్నారు. మార్కెట్లు, మాల్స్ సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-ఏ అధికారులు 100శాతం హాజరు కావాలి. మిగిలిన వాళ్లు 50శాతం విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రయివేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనిచేయాలి. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 20మందికి మించి ఉండరాదు. ఢిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో పని చేస్తాయి. ప్రజా రవాణా ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్స్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. మ్యాక్సీ క్యాబ్‌లో 5గురు, ఆర్టివిలో 11మంది ప్రయాణించవచ్చు. అంతరాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణా లకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమ తులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.