Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు మున్సిపల్ సమ్మె
అమరావతి : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నేడు, రేపు సమ్మె చేపట్టనున్నారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నారు. బకాయిపడ్డ వేతనాలు ఇవ్వాలని, ఇఎస్ఐ, పిఎఫ్ వెంటనే జమ చేయాలని, కాంట్రాక్టు-ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కార్మికులు ఏడాది కాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకు వినతిపత్రం ఇచ్చి మొరపెట్టుకున్నా కనీసంగానైనా పట్టించుకోవడం లేదు. చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని అమాత్యులు ప్రకటించినా ఆచరణలో విస్మరించారు. కార్మిక నాయకులను చర్చలకు ఆహ్వానించకపోగా సమ్మెలోకి వెళ్లడానికి వీల్లేదని బెదిరింపులకు దిగారు. కోవిడ్ సమయంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న తమపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోరుబాటే మార్గమని సమ్మెకు సిద్ధమయ్యారు. ఎపి స్టేట్ అగ్రికల్చరల్ కోపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఎపి ఆశావర్కర్ల యూనియన్ తదితర సంఘాల రాష్ట్ర కమిటీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.